: వైఎస్ హయాంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది: సీఎం కేసీఆర్


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. ‘తెలంగాణకు వైఎస్ అన్యాయం చేస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? కాంగ్రెస్ హయాంలో లోయర్ పెన్ గంగను ఎందుకు నిర్మించలేదు?’ అని కాంగ్రెస్ సభ్యులను కేసీఆర్ ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాడు తాము వ్యతిరేకించిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News