: ‘గుంటూరు టాకీస్’పై పోలీసులకు ఫిర్యాదు


‘చందమామ కథలు’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రూపొందించిన సినిమా ‘గుంటూరు టాకీస్’. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు వికలాంగులను కించపరిచేలా ఉన్నాయంటూ తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ‘గుంటూరు టాకీస్’ దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో సిద్ధు, నరేష్, రేష్మి, శ్రద్ధాదాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు హాట్ గా ఉన్నాయనే విమర్శలతో పాటు సిద్ధు, రేష్మి మధ్య రొమాన్స్ శృతి మించిందంటున్న వారూ లేకపోలేదు.

  • Loading...

More Telugu News