: రానా నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్: నటి శ్రియా
నటుడు రానా తనకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ అని, అంతకు మించి తమ మధ్య మరేమీ లేదని నటి శ్రియా స్పష్టం చేసింది. రానాకు, తనకు మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలను ఆమె ఖండించింది. తమ ఫ్రెండ్ షిప్ కొన్నాళ్లుగా కొనసాగుతోందని, తనకు, రానాకు కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని చెప్పింది. దియా మెహతా కూడా తమకు కామన్ ఫ్రెండేనని, ఇటీవల ఆమె ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కు రానా, తాను కలిసి వెళ్లామని చెప్పింది. అదేరోజున దియా పుట్టిన రోజు కూడా కావడంతో తమను లంచ్ కు తీసుకువెళ్లిందని శ్రియ చెప్పింది.