: భద్రత విషయంలో చాలా చర్చ జరిగింది: షోయబ్ మాలిక్
పాకిస్థాన్ క్రీడాకారులకు భద్రత విషయమై చాలా చర్చ జరిగిందని పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నాడు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడాడు. భారత్ లో పాకిస్థాన్ జట్టుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారని అన్నాడు. గతంలో తాను చాలాసార్లు ఎలాంటి భద్రత లేకుండానే భారత్ కు వచ్చి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించాడు. ఈ సందర్భంగా తన భార్య, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి కూడా మాట్లాడాడు. ఆమెది హైదరాబాద్ అన్న విషయం మీకు తెలుసు కదా? అని విలేకరులతో షోయబ్ అన్నాడు. ఆసియా కప్ లో పాక్ ఓటమిపై ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ... ఆసియా కప్ తో పోలిస్తే టీ20 వరల్డ్ కప్ భిన్నమైన టోర్నమెంట్ అన్నాడు. సత్తా చాటుకునేందుకు మంచి అవకాశమున్న టోర్నీ ఇది అని షోయబ్ పేర్కొన్నాడు.