: మాల్యా ప్రస్తుతమున్న భవంతి ఇదేనట!


ఇండియాలో విచారణకు భయపడి గుట్టు చప్పుడు కాకుండా మూటా ముల్లె సర్దుకొని బ్రిటన్ పారిపోయి రహస్యంగా తలదాచుకున్న విజయ్ మాల్యా ఉంటున్న భవంతి చిత్రాన్ని 'ముంబై మిర్రర్' బయటపెట్టింది. మాల్యా గుట్టుగా ఉంటున్న ఈ భవంతి బ్రిటన్ రాజధాని లండన్ కు 100 కిలోమీటర్ల దూరంలోని తివెన్ గ్రామంలో ఉందని ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఊరిలో అదే పెద్ద భవనమని, అక్కడికి మాల్యా వస్తే, ఊరంతా సందడిగా మారుతుందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు. కాగా, తాను బ్రిటన్ కు వచ్చినా, మీడియా వెంటాడుతోందని, మీడియాతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోనని మాల్యా నిన్న ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News