: రూ. 2 వేల కోట్లతో పని అయ్యేట్టుంటే... ఆ రోజు మీ జ్ఞానం ఏమైంది?: కాంగ్రెస్ కు కేసీఆర్ సూటి ప్రశ్న


కాంగ్రెస్ వారికి చేతగాక, చేవలేక వదిలేసిన పనులను తాము చిత్తశుద్ధితో చేపడుతుంటే, వారు విమర్శలు చేయడం ఎంతమాత్రం భావ్యమని కేసీఆర్ ప్రశ్నించారు. తాము వేల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ వాసులందరికీ మంచి నీటిని అందించేందుకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు చేపడితే, దాన్ని ఆమోదించి, మాకు కృతజ్ఞతలు చెప్పడం మానేసి అనవసర విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ ప్రాజెక్టు రూ. 2 వేల కోట్లతో చేపట్టవచ్చని కాంగ్రెస్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, అంత తక్కువ డబ్బుతో అందరికీ నీళ్లొచ్చే పనైతే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ రోజుల్లో మీ జ్ఞానం ఏమైపోయిందని ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం అనుభవించిన వేళ, ఒక్క నీటి ప్రాజెక్టును కూడా ఎందుకు చేపట్టలేదని అడిగారు. వారికి చేతగాకపోగా, పని చేస్తున్న తమను విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News