: జంగిల్ బుక్ హిందీ వర్షన్... ఏ పాత్రకు ఎవరు డబ్బింగ్ చెప్పారంటే...!
ది జంగిల్ బుక్... ఏళ్ల క్రితమే కార్టూన్ యానిమేషన్ రూపంలో సినిమాగా రూపొంది బాక్సాఫీసును కొల్లగొట్టిన చిత్రం. ఇప్పుడు తిరిగి డిస్నీ ఇదే కథను రియల్ మూవీగా తీర్చిదిద్దింది. భయంకర జంతువులే స్వయంగా నటించినట్టు గ్రాఫిక్స్ సాయంతో తీర్చిదిద్దింది. ఈ సినిమా ట్రయల్ ఇప్పటికే సంచలనం సృష్టించగా, తాజాగా హిందీ చిత్రం పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటీ నటులు డబ్బింగ్ చెప్పారన్న సంగతి తెలిసిందే. చిత్రంలో ప్రధాన పాత్ర మోగ్లీగా నీల్ సేథీ అనే భారత సంతతి కుర్రాడు నటిస్తుండగా, బాలూ (ఎలుగుబంటి)కు ఇర్ఫాన్, కా (కొండచిలువ)కు ప్రియాంకా చోప్రా, షేర్ ఖాన్ (పెద్దపులి)కు నానా పటేకర్, బగీరా (నల్ల చిరుతపులి)కు ఓంపురి, రక్షా (తోడేలు)కు షిఫాలీ షా, కింగ్ లూయీ (చింపాంజీ)కి భార్గవ డబ్బింగ్ చెప్పారని ఈ పోస్టర్ లో వెల్లడించారు.