: నన్ను 'ప్రధాని చెంచా' అన్నా ఏమనుకోను: అనుపమ్ ఖేర్
దేశం కోసం రాత్రనకా, పగలనకా కష్టపడుతున్న నరేంద్ర మోదీకి తాను మద్దతు పలకడాన్ని 'చెంచాగిరీ'గా అభివర్ణించినా తానేమీ మనసులో పెట్టుకోనని, అయితే భారత యువత ప్రధాని కృషిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందో తనకు తెలియడం లేదని అన్నారు. "మన పిల్లలు పాఠశాలల్లో మోదీకి మద్దతుగా నినదించాలి. లాల్ బహదూర్ శాస్త్రిని తలచుకోవాలి. అందుకు సమస్యేంటి?" అని ప్రశ్నించారు. "ఇక్కడో మనిషి (మోదీ) దేశ ముఖచిత్రాన్ని మార్చాలని తపన పడుతుంటే, వారు (విమర్శకులు) వ్యవస్థలో లోపాలను వెతికి, ఆయనను నిలువరించేందుకు యత్నిస్తున్నారు" అని ఆప్ కీ అదాలత్ లో భాగంగా రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు అనుపమ్ కేర్ సమాధానం ఇచ్చారు.