: అసెంబ్లీలో అక్బరుద్దీన్ ప్రశ్నల వర్షానికి కేటీఆర్ సమాధానాలు!


హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. నేటి ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మెట్రో రైలు ప్రాజక్టుపై పలు ప్రశ్నలు సంధించారు. మెట్రో పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? ఎన్ని స్టేషన్లు రానున్నాయి?ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీలు ఎలా ఉంటాయి? పాతబస్తీలో మెట్రో ఎలా సాగుతుంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ, పలు కోర్టు కేసులు అడ్డుగా ఉన్నందున మెట్రో పూర్తి కావడం ఆలస్యం కావచ్చని వివరించారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నందున ఒక్కో ముడినీ విప్పుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ 75 శాతం పనులు పూర్తయ్యాయని, వీలైనన్ని ఎక్కువ స్టేషన్లు ఉంటాయని, కొన్ని చోట్ల ఒక కిలోమీటరు లోపే రెండు స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో దాదాపు 200 నగరాల్లో మెట్రోలు ఉండగా, కేవలం నాలుగు మాత్రమే లాభాలను ఆర్జిస్తున్నాయని, చార్జీలపై ఇప్పటికింకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News