: ఇదిగో... ఇలా! హెయిర్ స్టయిల్ మార్చేసిన నరేంద్ర మోదీ


ప్రధాని నరేంద్ర మోదీని నిశితంగా గమనించారా? ఏదైనా మార్పు కనిపించిందా? ఎడమవైపు పాపిడి వదిలి కుడివైపునకు తల వెంట్రుకలు దువ్వుకునే ఆయన, ఇటీవల పైకి దువ్వుకుంటున్నారు. పాపిడిని కనిపించనీయట్లేదు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మోదీ కొత్త తలకట్టుతో కనిపిస్తున్నారు. మారిన మోదీ హెయిర్ స్టయిల్, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీల మధ్య హాట్ టాపిక్ అయింది. హెయిర్ స్టయిల్ వ్యవహారం ఆయన వ్యక్తిగతం కావడంతో తామెవరమూ దాని గురించి ఆరా తీయలేదని కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. మోదీ పాత హెయిర్ స్టయిల్, ఆపై మారిన హెయిర్ స్టయిల్ చిత్రాలను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News