: నరేంద్ర మోదీ కన్నా నా మంత్రివర్గంలోనే సిక్కులు అధికం: కెనడా ప్రధాని


భారత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని సిక్కుల కన్నా, తన మంత్రివర్గంలోనే సిక్కులకు అధిక ప్రాధాన్యం ఇచ్చానని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడావు వ్యాఖ్యానించారు. యూఎస్ పర్యటనలో భాగంగా అమెరికన్ వర్శిటీ విద్యార్థులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం నవంబరులో అధికారంలోకి వచ్చిన ట్రుడావు మంత్రివర్గంలో నలుగురు భారతీయులు ఉండగా, వారిలో ముగ్గురు సిక్కు వర్గానికి చెందిన వారే. ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో సిక్కు వర్గానికి చెందిన మేనకా గాంధీ, హర్ సిమ్రత్ కౌర్ లు ఇద్దరే సిక్కుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే విషయాన్ని కెనడా ప్రధాని గుర్తు చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News