: హెల్త్ అలర్ట్... కోరెక్స్, ఫెన్సిడిల్ సహా 350 ఔషధాలపై నిషేధం
సుమారు 350 ఎఫ్డీసీ (ఫిక్సెడ్ డోస్ కాంబిషేషన్) ఔషధాలను నిషేధిస్తున్నట్టు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిల్లో అత్యధికం ప్రస్తుతం మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్నవే కావడం గమనార్హం. వీటిల్లో కోరెక్స్, ఫెన్సిడిల్ వంటి దగ్గు మందులు కూడా ఉన్నాయి. వీటిని నిషేధించాలని గతంలోనే ప్రతిపాదనలు రాగా, ప్రస్తుతం వాటికి ఆమోదం పడింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సోమవారం వెలువడుతుందని తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ లో నిషేధింపబడ్డ అన్ని ఔషధాల వివరాలూ ఉంటాయి. మెదడుకు హాని చేసే కోడైన్ ఉండటమే వీటి నిషేధానికి కారణమని తెలుస్తోంది.