: న్యాయ సలహాల కోసం భారీగా ఖర్చు పెడుతున్న మాల్యా... నాలుగు రోజుల్లో రాకుంటే క్రిమినలే!


తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో లండన్ కు పారిపోయి, అక్కడి ఓ మారుమూల గ్రామంలో తలదాచుకున్న లిక్కర్ సామ్రాజ్యపు మాజీ అధినేత విజయ్ మాల్యా, తనకు న్యాయ సహాయం కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే భారత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆయన్ను విచారణకు రావాలని, 18వ తేదీన తమ ముందు హాజరు కావాలని నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఆ తేదీ నాటికి మాల్యా ఇండియాకు తిరిగి రాకుంటే, క్రిమినల్ విచారణ ప్రారంభించాలన్నది ఈడీ అభిమతంగా తెలుస్తోంది. ఆపై మాల్యాను అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరాలని అధికారులు భావిస్తుండగా, ఆ మార్గంలో మాల్యాను ఇండియాకు రప్పించడం అసాధ్యమేనని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, కింగ్ ఫిషర్ మాజీ సీఎఫ్ఓ రఘునాథన్, యూబీ సీఎఫ్ఓ రవి నెడుంగడిలను మాల్యా ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News