: మధుప్రియ ఓ ఏటీఎం మెషీన్: భర్త శ్రీకాంత్


నిన్నటివరకూ మంచి వాడిగా ఉన్న తాను ఒక్కసారిగా చెడ్డవాడిని ఎలా అయ్యానని గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ ప్రశ్నించాడు. మధు చేసిన ఆరోపణల వెనుక ఆమె తల్లి కుట్ర ఉందని ఆరోపించాడు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన శ్రీకాంత్, తాను ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆమెపై తనకు ప్రేమ తగ్గలేదని చెప్పాడు. మధుప్రియ ఓ ఏటీఎం మెషీన్ అని, ఆమె తన దగ్గరకు వచ్చిన తరువాత, తల్లిదండ్రుల వద్ద డబ్బు లేక ఆమె మనసు మార్చారని ఆరోపించాడు. ఇంట్లో డబ్బు లేక పూట గడవక తన భార్యను తనకు దూరం చేసే కుట్ర పన్నారని తెలిపాడు. వారు చేస్తున్న అన్ని ఆరోపణలకూ తన వద్ద సమాధానం ఉందన్నాడు.

  • Loading...

More Telugu News