: తెలుగుదేశంలో చేరితే రూ. 30 కోట్లు ఇస్తామన్నారు: వైకాపా ఎమ్మెల్యే
టీడీపీ నేతలు తనను ప్రలోభాలు పెట్టి, కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని విజయనగరం జిల్లా సాలూరు వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ, తెలుగుదేశం నేతలు తొలుత రూ. 5 కోట్లు ఇస్తామని వచ్చారని చెప్పారు. ఆపై రూ. 15 కోట్లు, మంత్రి పదవి ఇస్తామన్నారు. అప్పటికీ తాను స్పందించకపోవడంతో రూ. 30 కోట్ల వరకూ బేరం సాగిందని వివరించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను వైకాపాను వీడేది లేదని స్పష్టం చేసిన ఆయన, ఇటీవల ఫిరాయించిన ఎమ్మెల్యేలు అక్కడ ఇమడలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.