: ఆ జాబితాలో పారిస్ ‘ఉగ్ర’ దాడి ముష్కరుల పేర్లు


ఇరవై రెండు వేల మంది ఐఎస్ ఉగ్రవాదుల వివరాలున్న ఒక డాక్యుమెంట్ ను బ్రిటన్ కు చెందిన ఒక మీడియా సంస్థ ఇటీవల సంపాదించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఆ డాక్యుమెంట్ లో గత ఏడాది నవంబర్ లో పారిస్ ‘ఉగ్ర’ దాడులకు పాల్పడిన ముగ్గురు ముష్కరులు సమీ అమిమోర్, మహ్మద్ అఘాద్, ఒమర్ ఇస్మాయిల్ పేర్లు ఉన్నట్లు సమాచారం. 2013-14 సంవత్సరాల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఐఎస్ లో చేరినట్లు ఆ డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. 16 మంది బ్రిటన్ దేశస్థుల పేర్లు కూడా ఆ డాక్యుమెంట్ లో ఉన్నట్లు మీడియా సమాచారం. కాగా, లండన్ లోని బటక్లాన్ థియేటర్ లోకి ఐఎస్ ముష్కరులు చొరబడి నరమేధానికి పాల్పడిన సంఘటనలో 90 మంది చనిపోగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News