: కేరళ ఎన్నికల పోరులో టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని కేరళలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మనోజ్ శంకరనెల్లూర్ పేర్కొన్నారు. మొదటి జాబితాలో 70 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకుగాను తమ అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేశారు. త్వరలో రెండో జాబితాను విడుదల చేస్తామని మనోజ్ శంకరనెల్లూర్ తెలిపారు. పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ఏప్రిల్‌లో తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్‌లో జరిగే మూడు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారని చెప్పారు. ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 16న పోలింగ్ జరగనుంది.