: భర్తపై గాయని మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు


ప్రముఖ గాయని మధుప్రియ తన భర్త శ్రీకాంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వేధింపులపాలు చేస్తున్నాడంటూ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మధుప్రియ, ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్లు సమాచారం. పెళ్లయిన తర్వాత కేవలం ఐదు నెలల కాలంలోనే వారు విడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది. గత అక్టోబర్ లో తన తల్లిదండ్రులను ఎదిరించి మధుప్రియ ప్రేమ వివాహం చేసుకుంది. కాగా, ‘ఆడపిల్లనమ్మా... నేను ఆడపిల్లనమ్మా..’ అనే పాట మధుప్రియకు మంచి గుర్తింపు తెచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News