: ముషారఫ్ కు 30 వరకు రిమాండు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు బేనజీర్ భుట్టో హత్య కేసులో రావల్పిండిలోని ఏటీసీ కోర్టు ఈ నెల 30 వరకు రిమాండు విధించింది. ఈ హత్య కేసులో ముషారఫ్ ను నిందితునిగా చేర్చేందుకు నిన్న అనుమతినిచ్చిన ఏటీసీ కోర్టు విచారణకు అంగీకరించింది. దీంతో ముషారఫ్ మరింత చిక్కుల్లో పడనున్నారు. రెండురోజుల కిందట ఈ కేసులో మాజీ అధ్యక్షుడు పెట్టుకున్న మధ్యంతర బెయిల్ ను లాహోర్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.