: మాల్యాను ఎలా వెళ్లనిచ్చారు?: మోదీకి కేజ్రీ సూటి ప్రశ్న
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఐడీబీఐలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ మాజీ ఛైర్మన్ విజయ్‌మాల్యాను దేశం నుంచి ఎలా వెళ్లనిచ్చారని దేశప్రధానికి కేజ్రీవాల్ ప్రశ్న వేశారు. ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షం శివసేన కూడా కేంద్రాన్ని ఈ విషయమై ప్రశ్నించిన విషయం తెలిసిందే. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేరుగా ప్రధానికి నివేదికలు పంపినా, మాల్యాను ఎలా వెళ్లనిచ్చారో తెలపాలని కోరారు. మాల్యా మార్చి 2వ తేదీన ఎవరి అనుమతితో దేశం విడిచి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. మాల్యా ఉదంతంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ప్రతిపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షం శివసేన మండిపడుతుంటే మాజీ ప్రధాని దేవేగౌడ, విజయ్‌మాల్యా మాజీ పార్లమెంట్ సహచరుడు ఫరూఖ్ అబ్దుల్లా నుంచి మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే.