: విజయ్ మాల్యాకు దేవెగౌడ మ‌ద్ద‌తు.. మాల్యాను టార్గెట్ చేయొద్ద‌ని వ్యాఖ్య‌


బ్యాంకుల నుంచి రుణం తీసుకుని మోసం చేసిన కేసులో కింగ్‌ఫిషర్‌ విమానయాన సంస్థ మాజీ ఛైర్మన్‌ విజయ్‌మాల్యాకు త‌న మాజీ పార్ల‌మెంట్ స‌హ‌చ‌రుడు ఫ‌రూఖ్ అబ్దుల్లా నుంచి స‌పోర్ట్ ల‌భించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో మాల్యా తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యుల‌ర్‌) నాయకుడు దేవెగౌడ మద్దతు కూడా పొందారు. మాల్యాను పరారీలో ఉన్నట్లు పేర్కొనడం ప‌ట్ల దేవెగౌడ అభ్యంత‌రం తెలిపారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) విజయ్ మాల్యాకు సమన్లు జారీ చేసిందనీ, దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారనీ దేవెగౌడ ఈరోజు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో అన్ని వైమానిక సంస్థలూ నష్టాలలోనే ఉన్నాయని ఆయ‌న అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య వేత్త అయిన విజయ్ మాల్యాను అనుమానించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. త‌న‌పై వస్తున్న ఆరోప‌ణ‌లను ఖండిస్తూ.. శుక్ర‌వారం మీడియాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విజ‌య్‌మాల్యా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన విష‌యం తెలిసిందే. ట్విట్ట‌ర్‌లో మాల్యా ‘ఇండియా నుంచి నేనెక్క‌డికీ పారిపోలేదు, నేను భార‌త న్యాయ వ్య‌వ‌స్థ‌ను గౌర‌విస్తాను’ అంటూ ట్వీట్ చేశారు. అనంత‌రం ఐడీబీఐలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో కింగ్‌ఫిషర్‌ విమానయాన సంస్థ మాజీ ఛైర్మన్‌ విజయ్‌మాల్యా ఉదంతంపై పార్ల‌మెంట్‌లో పాల‌క‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వాద‌న‌లు కూడా జ‌రిగాయి.

  • Loading...

More Telugu News