: వంట చేసే టైం లేదు.. బంగ్లా కోడి వంటకమంటే చాలా ఇష్టం: ఎంపీ కవిత
తనకు వంట చేయడమంటే ఇష్టమని, కానీ, వంట చేసే సమయం దొరకడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. హైదరాబాదు, జూబ్లీహిల్స్ లో ఒక రెస్టారెంట్ ను జస్టిస్ సుభాషణ్ రెడ్డి తో కలిసి ఆమె ఈరోజు ప్రారంభించారు. తాను భోజన ప్రియురాలినని, బంగ్లా కోడి వంటకం అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా కవిత తన మనసులో మాట బయటపెట్టారు. మన దేశంలో హైదరాబాద్ వంటకాలకు ప్రత్యేకత ఉందని... ఇక్కడ 50 రకాల బిర్యానీలు దొరుకుతాయని కవిత పేర్కొన్నారు.