: శునకాల వివాహం...5000 మంది అతిథులు..ప్రత్యేక డీజే.. పసందైన విందు!


ఆ రెండు కుటుంబాల వారు హిందూ సంప్రదాయం ప్రకారం రెండు శునకాలకు ఘనంగా పెళ్లి జరిపించారు. శునకాల వివాహానికి ప్రజలు భారీగా తరలివచ్చి వాటిని ఆశీర్వదించారు. వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్న ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో జరిగింది. ఆ జిల్లాలోని పావారా గ్రామంలో బాసంత్ త్రిపాఠి, జంగ్ బహుదూర్ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ రెండు కుటుంబాల వారు శునకాలను పెంచుకున్నారు. ఆ రెండింటికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. బాసంత్ త్రిపాఠి కుటుంబానికి చెందిన వరుడు శునకం షాగున్ ను, జంగ్ బహుదూర్ కుటుంబానికి చెందిన వధువు శునకం షాగునియాకు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ఈ వివాహానికి మొత్తం 5,000 మంది అతిథులు హాజరయ్యారు. ప్రత్యేక డీజేను కూడా ఏర్పాటు చేశారు. అతిథులకు భారతీయ వంటకాలతో వధువు తరపు వారు విందు కూడా ఇచ్చారు. ఇక అప్పగింతల విషయానికొస్తే.. షాగునియాను వరుడు శునకంతో పంపే సమయంలో జంగ్ బహుదూర్ కుటుంబం కన్నీటిపర్యంతమయ్యారు. షాగున్, షాగునియాలను కారులో సాగనంపే సమయంలో ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ ప్రజలందరూ విష్ చేశారు.

  • Loading...

More Telugu News