: పార్లమెంటులో చేసిన చట్టాలకే విలువ లేకుండా పోతోంది!: తులసిరెడ్డి


పార్లమెంటులో చేసిన చట్టాలకే విలువ లేకుండా పోతోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీకి వెళ్తున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్టపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 లక్షల కోట్లు రావాల్సి ఉండగా, మూడు బడ్జెట్లు పూర్తయినా రూ.10 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన విమర్శించారు. ఈ మేరకు పార్లమెంటులో చేసిన చట్టాలకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై తులసిరెడ్డి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News