: యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు చేపట్టాం: మంత్రి కేటీఆర్


ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు చేపట్టామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకుగాను కేవలం పదిరోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించామన్నారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎంఎంటీఎస్ వల్ల రవాణా సౌకర్యం మెరుగవుతుందన్నారు. మెట్రో విస్తరణ సాధ్యాసాధ్యాలపై సర్వే చేస్తామన్నారు. మెట్రో రైల్ రెండో దశలో మియాపూర్-పటాన్ చెరువు, ఎల్బీనగర్- హయత్ నగర్, రాయదుర్గం-శంషాబాద్, నాగోల్-శంషాబాద్, తార్నాక-ఈసీఐఎల్ ఉంటాయని కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News