: భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసల జల్లు!
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ భాధ్యతలు చేపట్టిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నేటి ఉదయం ఢిల్లీలో ప్రారంభమైన ‘అడ్వాన్సింగ్ ఆసియా’ సదస్సుకు మోదీతో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టియానే లగార్డే కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా లగార్డే కీలక ప్రసంగం చేశారు. వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక సంస్కరణలే ఇందుకు దోహదపడనున్నాయని ఆయన పేర్కొన్నారు.