: తుని గర్జనలో ‘రత్నాచల్’ నష్టం రూ.8.29 కోట్లు!


కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా తుని ‘గర్జన’కు హాజరైన కాపులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ విధ్వంసంలో విజయవాడ- విశాఖల మధ్య పరుగులు పెడుతున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు భారీగానే నష్టం జరిగింది. ఈ నష్టం విలువ ఎంత అన్న విషయంపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రోజుల తరబడి అంచనాలు కట్టింది. చివరకు నిన్న ఆ నష్టం విలువ ఎంతన్న విషయం తేలింది. గంటల తరబడి సాగిన ధ్వంస రచనలో భాగంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లోని 24 బోగీలకు నష్టం జరిగింది. వీటిలో కొన్ని బోగీలు పూర్తిగా దగ్ధం కాగా, మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయి. వీటిని పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడానికి రూ.8.29 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ తేల్చింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా నిన్న రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News