: రోజా పిటిషన్ పై విచారణ చేపట్టలేమన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం!...మరో బెంచ్ కు బదిలీ!


ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు బహిష్కరణకు గురైన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా... సదరు సస్పెన్షన్ ను ఎత్తివేయించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించిన రోజాకు ఊరట లభించలేదు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కారు. మూడు రోజుల క్రితం దాఖలైన రోజా పిటిషన్ పై నిన్న విచారణ జరుగుతుందని ప్రచారం సాగింది. జస్టిస్ జగదీశ్ ఖేహార్, జస్టిస్ నాగప్పన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై వాదనలు వినలేమని తేల్చిచెప్పింది. నిన్న కోర్టు ప్రొసీడింగ్స్ లో భాగంగా రోజా తరఫున వాదనలు వినిపించేందుకు ఆమె తరఫు లాయర్ లేవగానే... దీనిపై విచారణ చేపట్టలేమని జస్టిస్ ఖేహార్ చెప్పారు. ఈ పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేస్తామని, సదరు బెంచ్ లో సోమవారమే దీనిపై విచారణ జరుగుతుందని ఆయన ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులు, రాజకీయాలతో ముడివడి ఉన్న అంశాలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం పేరిట ప్రత్యేక బెంచ్ ఏర్పాటైన విషయం తెలిసిందే. రోజా పిటిషన్ ను సోమవారం ఈ బెంచ్ విచారించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News