: నిత్యానంద ‘జంపింగ్ యోగా’లో రంజిత... నెట్ లో వీడియో హల్ చల్!
వివాదాస్పద స్వామి నిత్యానంద అశ్రమంలో ప్రస్తుతం ‘జంపింగ్ యోగా’ పేరిట కొనసాగుతున్న సరికొత్త యోగాసనాలు ఆసక్తి రేపుతున్నాయి. గతంలో సినీ నటి రంజితతో నిత్యానంద స్వామి సన్నిహితంగా ఉన్న వీడియో దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ‘జంపింగ్ వీడియో’ పేరిట నెట్ లో ప్రత్యక్షమైన మరో వీడియో నెటిజన్లను తెగ నవ్వించేస్తోంది. అసలు ఈ ‘జంపింగ్ యోగా’ అంటే ఏంటనేగా మీ సందేహం? అంత పెద్ద కష్టమైన పనేమీ కాదులెండి. కేవలం... కూర్చున్న చోటు నుంచి పైకి ఎగరడం, పూనకం వచ్చినట్లు ఊగిపోవడం వస్తే... ఈ యోగా వచ్చేసినట్లే. తమ ఆశ్రమానికి వచ్చిన భక్తుల చేత నిత్యానంద ఈ తరహా యోగా చేయిస్తున్నారు. ఇక నిత్యానందకు శిష్యురాలిగా మారిన రంజిత కూడా తనవంతుగా ‘జంపింగ్ యోగా’ చేస్తూ భక్తులను ఉత్సాహపరుస్తోంది. ప్రస్తుతం నెట్ లోకి వచ్చేసిన వీడియోలో... గజమాలతో నిత్యానంద తన పీఠంపై కూర్చుని భక్తులకు ఉపదేశాలు చేస్తుంటే... రంజిత మాత్రం భక్తుల మధ్యలో ముందు వరుసలో కూర్చుని ‘జంపింగ్ యోగా’ ప్రాక్టీస్ చేస్తోంది. కూర్చున్న చోటే ఎగిరి పడుతూ, పూనకం వచ్చినట్లు ఊగుతూ రంజిత బాగానే ప్రాక్టీస్ చేస్తోంది. కొంతమంది భక్తులు కూడా నిత్యానంద మాటలకు మైమరచిపోతూ ‘జంపింగ్ యోగా’ను ఆసక్తిగా నేర్చుకుంటున్న దృశ్యాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.