: చంద్రబాబుకు కాపులు, బీసీలు రెండు కళ్లు లాంటివాళ్లు!: కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్
కాపులు, బీసీలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికు రెండు కళ్లు లాంటివారని ఏపీ కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రామాంజనేయులు అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు బాబు కృషి చేస్తున్నారన్నారు. కాపులకు రూ.1000 కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం ప్రతిపాదించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం ద్వారా బీసీలకు ఎటువంటి నష్టం జరగదని అన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్న హామీలు ఎన్నికల సమయంలో తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్నవేనని..వాటిలో ఇప్పటికే కొన్ని హామీలను ప్రభుత్వం అమలు చేసిందని రామాంజనేయులు అన్నారు.