: సమస్యలు ఎదురైనా అధైర్యపడొద్దు... నవ్వుతూ ముందుకెళ్లండి: శ్రీశ్రీ రవిశంకర్
సమస్యలు ఎదురైనా అధైర్యపడవద్దని..నవ్వుతూ ముందుకెళ్లాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ సూచించారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ స్థాపించి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ, ప్రపంచంలో ప్రజలను ఏకం చేసేందుకు 5 మాధ్యమాలున్నాయన్నారు. వివిధ మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలను ఏకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి మీరు ఎంత ప్రేమ పంచుతారో, మీలో అది వందరెట్లు పెరుగుతుందని అన్నారు. ఈ ఉత్సవాలు తన ప్రైవేటు కార్యక్రమమని కొందరన్నారని, కానీ, ప్రపంచమే తన కుటుంబమని రవిశంకర్ పేర్కొన్నారు.