: అమరావతి నిధుల సమీకరణకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అంగీకారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లండన్ లో చాలా బిజీగా ఉన్నారు. చంద్రబాబుతో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్రతినిధులు సమావేశమయ్యారు. బాబు బృందానికి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి గురించి సంస్థ సీఈఓ నిఖిల్ రాఠీ వివరించారు. కాగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మౌలిక సదుపాయాల కల్పనపై సంస్థ ప్రతినిధులతో బాబు చర్చించారు. అమరావతిలో భాగస్వామ్య అవకాశాలపై, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. అమరావతికి నిధుల సమీకరణలో సాయం అందించేందుకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి అంగీకరించినట్లు సమాచారం. కాగా, ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం నిన్న లండన్ పర్యటనకు ఆయన వెళ్లారు. మూడురోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది.