: ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం


ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. 155 దేశాలకు చెందిన కళాకారులు, ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. కాగా, ఢిల్లీలో భారీ వర్షం కారణంగా ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News