: సస్పెన్స్ కు తెరదించిన పీసీబీ... భారత్ కు బయలుదేరనున్న పాక్ క్రికెట్ జట్టు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సస్పెన్స్ కు తెరదించింది. టీ20 వరల్డ్ కప్ లో ఈ జట్టు పాల్గొననుంది. మరి కొన్ని గంటల్లో భారత్ కు పాక్ క్రికెట్ టీమ్ బయలుదేరనుంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ కు రావాలంటే పీసీబీ పలు షరతులు విధించిన విషయం తెలిసిందే. ఈ షరతులకు మన హోం శాఖ పూర్తి హామీ ఇవ్వడంతో భారత్ పర్యటనకు పీసీబీ అంగీకరించింది. పాకిస్తాన్ రేపు తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది. మార్చి 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్-పాక్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. దాయాదుల పోరు కోసం రెండు దేశాల క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.