: అన్నింటికీ ‘ఆధార్’ తప్పనిసరి... చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం


‘ఆధార్’ కు చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, దేశంలో 97 శాతం మంది ప్రజలకు ఆధార్ కార్డులు ఉన్నాయన్నారు. యునిక్ ఐడెంటిటీ నంబర్ గా పిలిచే ‘ఆధార్’ను పౌర ఆమోదపత్రం కింద నమోదు చేస్తామన్నారు. ఆధార్ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం వాటిల్లకుండా బిల్లులో నిబంధనలు ఏర్పాటు చేశామన్నారు. ఆధార్ కార్డు కోసం రోజుకు 5 నుంచి 7 లక్షల మంది ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారని జైట్లీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News