: ఇదే మీకు ఆఖరి అవకాశం: అగ్రిగోల్డ్ కు హైకోర్టు హెచ్చరిక


"మీకిదే చివరి అవకాశం. మరోసారి చాన్స్ ఇచ్చే సమస్యే లేదు. మీకు అనుభవం ఉంది. ఆస్తుల వేలానికి సహకరించండి. వెంటనే ఆస్తులు అమ్మి ప్రజల డబ్బు పంచండి. లేకుంటే మరింత కఠినంగా వ్యవహరించక తప్పదు" ఇవి నేడు అగ్రిగోల్డ్ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. అగ్రిగోల్డ్ కు చివరి చాన్స్ ఇస్తున్నామని, తదుపరి వాయిదాకు వచ్చేసరికి కోర్టుకు తృప్తి కలిగించే సమాధానంతో రావాలని హెచ్చరించింది. ఏపీ సీఐడీ తన వాదన వినిపిస్తూ, కేసులో దర్యాఫ్తు జరుగుతోందని, నివేదికను త్వరలోనే కోర్టుకు సమర్పిస్తామని తెలిపింది. ఇదే సమయంలో అక్షయ గోల్డ్ కేసును విచారించిన కోర్టు, సంస్థ చైర్మన్ పాల్సన్ అన్ని వాయిదాలకూ హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. అక్షయ గోల్డ్ లో డైరెక్టర్లందరినీ అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీకి ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి, సమగ్ర వివరాలతో కోర్టుకు రావాలని సూచిస్తూ, రెండు కేసుల విచారణనూ ఈ నెల 24కు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News