: సుజలాం సుఫలాం అనే దేశంలో 'అన్నమో రామచంద్రా' అనే ఆకలి కేకలు ఏంటి?: ప్రజా గాయకుడు గద్దర్


సుజలాం సుఫలాం అనే మన దేశంలో 'అన్నమో రామచంద్రా' అనే ఆకలి కేకలు ఏమిటని ప్రజాగాయకుడు గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18న విడుదల కానున్న 'దండకారణ్యం' చిత్రంలో మూడు పాటలు రాసిన గద్దర్ వాటిని పాడటమే కాకుండా వాటిలో నటించారు కూడా. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 'అడవి తల్లి.. ప్రకృతి తల్లి.. సర్వ సంపదకు భారతదేశపు ఖని, గిరిజనులే నిజమైన దేశ భక్తుల'ని అన్నారు. 'మా వనరులు మాకే దక్కాలి' అని బ్రిటిష్ వారిని గడగడలాడించిన వారు గిరిజనులు అని గద్దర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News