: ప్రజల సొమ్ము నొక్కేసి చెక్కేసిన 164 కంపెనీలు: లోక్ సభలో జైట్లీ
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రజలను మోసం చేసిన కంపెనీలు ఉన్నాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభకు వెల్లడించారు. 164 కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేసి ఆపై, మూతపడ్డాయని, వీటిపై ఎస్ఎఫ్ఐఓ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్), సీబీఐ సహా వివిధ ప్రభుత్వ ఏజన్సీలు విచారణ జరుపుతున్నాయని ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ఈ తరహాలో డిపాజిట్లను వసూలు చేస్తున్న కంపెనీలు ఇంకా ఉన్నాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామని, కార్పొరేట్ మోసాలను అరికట్టి, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పొంజీ స్కీములను అరికట్టేందుకు వివిధ రాష్ట్రాలు వివిధ మార్గాలను అవలంబిస్తున్నాయని, ఒక్కో రాష్ట్రంలో చట్టం ఒక్కోలా ఉందని ఆయన గుర్తు చేశారు.