: దిగొచ్చిన ఏఓఎల్... రూ. 25 లక్షలు కట్టిన శ్రీశ్రీ రవిశంకర్
యమునా నదీ తీరాన్ని కలుషితం చేసేలా భారీ స్థాయిలో సదస్సును తలపెట్టిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఏఓఎల్) వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ జాతీయ హరిత ట్రైబ్యునల్ మొట్టికాయలకు దిగొచ్చారు. జరిమానాగా విధించిన రూ. 5 కోట్లను చెల్లించబోనని, అవసరమైతే జైలుకు వెళతానని నిన్న స్పష్టం చేసిన రవిశంకర్, నేడు దిగొచ్చారు. శుక్రవారం నాడు రూ. 25 లక్షలను, ఆపై మరో మూడు వారాల్లోగా మిగిలిన రూ. 4.75 లక్షలను చెల్లిస్తానని ట్రైబ్యునల్ ముందు అంగీకరించారు. అంత మొత్తం స్వల్ప వ్యవధిలో సమకూర్చడం ఏఓఎల్ కు కష్టమని ఆయన తరఫు న్యాయవాదులు వాదన వినిపించగా, ట్రైబ్యునల్ సమ్మతించింది. సాయంత్రం 5 గంటల్లోగా డీడీఏ (ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ)కు డబ్బు చెల్లించాలని సూచించింది.