: మారుతీ సుజుకీ కొత్త కారుకు అనూహ్య స్పందన
గత మంగళవారం మార్కెట్ లోకి విడుదలైన విటారా బ్రెజ్జా పేరిట కొత్త ఎస్ యూవీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికల్) కారుకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కొత్త కారును విడుదల చేసిన 48 గంటల్లో 5,600 మంది బుక్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కారు ధరను రూ.6.99 నుంచి 9.68 లక్షలుగా నిర్ణయించారు. ఇది లీటర్ కు 24.3 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ విభాగంలో ఇంత అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదేనని సంస్థ ప్రతినిధులు చెప్పారు.