: సుక్మా జిల్లాలో ల్యాండ్ మైన్ పేల్చిన మావోలు... 12 మంది జవాన్లకు గాయాలు


వరుస ఎదురు దెబ్బలతో సతమతమవుతున్న నిషేధిత మావోయిస్టులు దొంగదెబ్బ తీశారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా మర్లగూడెం వద్ద నేటి ఉదయం మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో వాహనంలోని 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల దాడిపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు క్షతగాత్రులను తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News