: మహా దాన కర్ణుడు బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. తనలో దాతృత్వం నిండుకుందని నిరూపించారు. పోలియో నిర్మూలన కోసం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇరాడికేషన్ ఇనిషియేటివ్ కార్యక్రమానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ తరఫున సుమారు 54వేల కోట్ల రూపాయలను దానంగా అందిస్తానని బిల్ గేట్స్ అబుదాబిలో ప్రకటించారు. విశేషమేమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమ నిర్వహణకు కావాల్సిన నిధులలో మూడింట ఒక వంతు గేట్స్ అందివ్వనున్నారు. దీంతో పోలియో నిర్మూలనపై పోరాటం మరింత శక్తిమంతం కానుంది.
గేట్స్ దాతృత్వం గురించి ప్రపంచానికి తెలియంది కాదు. గతంలోనే ఆయన దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా విరాళాన్ని ప్రకటించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో పాటుపడుతున్నారు. చాలా మంది అభిప్రాయం ప్రకారం బిల్ గేట్స్ మనుషులలో దేవుడు.