: మొదటి వరుసలో తలసాని, రెండో లైన్లో ఎర్రబెల్లి... అసెంబ్లీలో సీట్ల కేటాయింపు పూర్తి!


తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి, ఆపై అధికార పార్టీలోకి ఫిరాయించి, ఇప్పుడు టీఆర్ఎస్ అనుబంధ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందిన వారికి అసెంబ్లీలో సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం ఆరు బ్లాకుల్లో వీరికి సీట్లను కేటాయిస్తూ, అసెంబ్లీ కార్యదర్శి తన నిర్ణయాన్ని వెలువరించారు. 3వ బ్లాక్ లోని ఫస్ట్ లైన్లో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ కు, అదే బ్లాక్ రెండో లైన్లో ఎర్రబెల్లి దయాకర్, సాయన్నలకు, నాలుగో లైన్లో రాజేందర్ రెడ్డికి సీట్లు కేటాయించారు. బ్లాక్ 1 ఐదో లైన్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి, రెండో బ్లాక్ నాలుగో లైన్లో మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి, నాలుగో బ్లాక్ 3వ వరుసలో మాగంటి గోపీనాథ్, ధర్మారెడ్డి, అరికెపూడి గాంధీలకు, నాలుగో లైన్లో వివేకానందకు, 5వ బ్లాక్ రెండో లైన్లో ప్రకాశ్ గౌడ్ కు సీట్లిచ్చారు.

  • Loading...

More Telugu News