: ఏపీలో మూడు జిల్లాలకు పెట్టుబడులు నిల్!... గుట్టువిప్పిన ఆర్థిక సర్వే


రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో కొత్తగా ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదే అదనుగా తమ ప్రభుత్వ పనితీరుతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడటం ఖాయమని కూడా టీడీపీ సర్కారు జోరుగా ప్రచారం చేసుకుంది. అయితే ఇదంతా కేవలం ప్రచార ఆర్భాటమేనని సాక్షాత్తు ప్రభుత్వమే నిన్న అసెంబ్లీ ముందు పెట్టిన ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. అంతేకాక గడచిన 20 నెలల్లో రాష్ట్రంలోని మూడు జిల్లాలకు నయా పైసా పెట్టుబడులు కూడా రాలేదన్న కఠోర వాస్తవాన్ని సభ ముందుంచింది. పెట్టుబడులు రాని జిల్లాల్లో రాయలసీమలో బాగా వెనుకబడ్డ జిల్లాగా పేరుపడ్డ అనంతపురం, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోని పశ్చిమగోదావరి జిల్లా, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖ పొరుగునే ఉన్న శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో గడచిన 20 నెలల్లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదట. ఇక మిగిలిన జిల్లాల పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదని కూడా ఆర్థిక సర్వే చెప్పింది. టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో 64 కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వివిధ కార్పొరేట్ సంస్థలు సమ్మతి తెలపగా, 31 ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరో 33 త్వరలో ఏర్పాటు కానున్నాయి. ఈ మొత్తం 64 పరిశ్రమల విలువ రూ.3,639 కోట్లుగా ఆర్థిక సర్వే పేర్కొంది. అనంతపురంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 46 కార్పొరేట్ సంస్థలు ముందుకు రాగా, ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కటి కూడా కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News