: భార్యపై అత్యాచారం నేరమనడం సరికాదు: మేనకా గాంధీ
వివాహబంధంతో ఒకటైన జంట మధ్య అత్యాచార కేసులు పెట్టే విధానం ఇండియాకు సరిపడదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. వైవాహిక అత్యాచారం (మేరిటల్ రేప్)పై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ విషయమై పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకున్నట్టుగా ఇండియాలో అవగాహన లేదని ఆమె వివరించారు. ఇక్కడి అక్షరాస్యత, మత విశ్వాసాలు, వివాహబంధంపై ఉన్న నమ్మకం తదితరాల కారణంగా, వైవాహిక అత్యాచారాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించలేమని అన్నారు. కాగా, గత సంవత్సరం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హరిభాయ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.