: కన్నయ్యను పక్కకు పిలిచి దాడి చేసిన బిల్డర్!... జేఎన్ యూలోనే ఘటన
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిన్న మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. వర్సిటీతో ఏమాత్రం సంబంధం లేని ఓ బయటి వ్యక్తి వర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించడమే కాక వర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న కన్నయ్యకుమార్ పై దాడికి దిగాడు. అది కూడా ఏ నిర్జన ప్రదేశంలోనో కాదు. ఓ వైపు ఏదో అంశంపై సభ జరుగుతుండగా, అందులో ప్రసంగిస్తున్న కన్నయ్యను పక్కకు పిలిచిన ఆ వ్యక్తి మెరుపు దాడికి దిగాడు. దీంతో షాక్ తిన్న విద్యార్థులు అక్కడికి పరుగులు పెట్టి అతడి బారి నుంచి కన్నయ్యను కాపాడారు. ఆ తర్వాత అతడిని బంధించి పోలీసులకు అప్పగించారు. విచారణలో భాగంగా సదరు వ్యక్తి ఘజియాబాదుకు చెందిన రియల్ ఎస్టేట్ బిల్డర్ వికాస్ చౌదరిగా తేలింది. భారత సైన్యంపై కన్నయ్యకుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడికి పాల్పడినట్లు వికాస్ పోలీసులకు చెప్పాడు.