: బడ్జెట్ ప్రసంగంలో యనమల సరికొత్త రికార్డు... సొంత రికార్డునే బద్దలుకొట్టిన వైనం
బడ్జెట్ ప్రసంగంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సరికొత్త రికార్డులు నెలకొల్పారు. నిన్న ఏపీ అసెంబ్లీలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన యనమల... బడ్జెట్ ప్రసంగాన్ని రికార్డు స్థాయిలో 2 గంటల 7 నిమిషాల పాటు కొనసాగించారు. గతంలో 1 గంట 45 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసి ‘సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం’ రికార్డును యనమల నెలకొల్పారు. తాజాగా నిన్న 2 గంటల 7 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసిన ఈ టీడీపీ సీనియర్ నేత... తన రికార్డును తానే బద్దలు కొట్టేశారు. గతంలో మాతృభాషలో బడ్జెట్ ప్రసంగం చేసిన యనమల... తాజాగా నిన్న మాత్రం తన బడ్జెట్ ప్రసంగాన్ని సాంతం ఆంగ్లంలోనే కొనసాగించడం గమనార్హం.