: ఏపీలో కాల్ మనీ ఘటనపై ఏక సభ్య కమిషన్ ఏర్పాటు


ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టించిన కాల్ మనీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అప్పారావు సారథ్యంలో ఈ కమిషన్ విచారణ సాగిస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఏపీలో గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కాల్ మనీ ఆగడాలు మితిమీరిపోయాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోవడం ... మహిళలను రకరకాలుగా వేధించడం జరిగింది. ముఖ్యంగా చాలా మంది మహిళలు కాల్ మనీ ముఠా చేతుల్లో చిక్కుకుపోయి ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం, ఈ విషయమై బాబు సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే.

  • Loading...

More Telugu News