: సినీ దర్శకుడు గుణశేఖర్ భార్య కారు బీభత్సం...పలు వాహనాలు ధ్వంసం!


ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ భార్య రాగిణి కారు బీభత్సం సృష్టించిన సంఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఈరోజు రాత్రి జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్పి ఉంది. కాగా, 'రుద్రమదేవి' చిత్రం రాగిణి సమర్పణలో, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన విషయం తెలిసిందే. రుద్రమదేవి చిత్రానికి ప్రేక్షకుల, అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి.

  • Loading...

More Telugu News