: ఆ పద్ధతి బాలీవుడ్ లో కూడా రావాలి: హేమమాలిని


హాలీవుడ్ కి చెందిన నాటి తరం నటులు ఇప్పటికీ మంచి పాత్రల్లో నటిస్తూనే ఉన్నారని... ఆ పద్ధతి బాలీవుడ్ లో కూడా రావాలని డ్రీమ్ గర్ల్ హేమమాలిని అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బాలీవుడ్ లోని అలనాటి నటులకు ఇప్పుడు అవకాశాలు రావట్లేదని అన్నారు. తాను 150 సినిమాల్లో నటించానని, ఇంకా నటించాలని ఉందని చెప్పిన ఆమె తనకు మంచి పాత్రలు రావట్లేదని చెప్పారు. సినిమా నిర్మాణం భారీ బడ్జెట్ తో ముడిపడి ఉంటుంది కనుక తనలాంటి పాతతరం నటులకు పాత్రలివ్వడం రిస్క్ గా ఫీలవుతుంటారని డ్రీమ్ గర్ల్ అభిప్రాయపడింది. కాగా, 2011లో వచ్చిన 'అరక్షణ్' చిత్రంలో హేమమాలిని అతిథి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం 'సిమ్లా మిర్చి'లో ఆమె నటిస్తోంది.

  • Loading...

More Telugu News